ప్రభాస్ 'మిర్చి' ఫస్ట్ డే కలెక్షన్స్ అదుర్స్

 

 

 Prabhas Mirchi First Day Collections|Mirchi First day Collections, Mirchi Collections, Mirchi One day Collections, Mirchi Overseas Collections, Prabhas Mirchi 1 day collections

 

 

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఆడియన్స్ లో రోజు రోజు కి పెరిగిపోతుంది. ప్రభాస్ "మిర్చి" బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. "మిర్చి" రొటీన్ స్టోరీ అయినా ప్రభాస్ మ్యాజిక్ తో అన్నివైపుల నుంచి పాజిటివ్ టాక్ రాబట్టింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే రూ. 7.67 కోట్లు షేర్ వసూలు చేసిందని అంటున్నారు.


ఏరియాల వారిగా నైజాం నుంచి రూ. 2.30 కోట్లు, సీడెడ్ రూ.1.30 కోట్లు, నెల్లూరు 30 లక్షలు, కృష్ణా 37 లక్షలు, గుంటూరు 78 లక్షలు, వైజాగ్ 54 లక్షలు, తూర్పుగోదావరి 64 లక్షలు, పశ్చిమ గోదావరి 54 లక్షలు వసూళ్లు రాబట్టడంతో రాష్ట్రం నుంచి రూ. 6.77 కోట్లు వసూలు చేసింది. కర్ణాటక నుంచి 25 లక్షలు, ఇండియాలో ఇతర ప్రాంతాలన్నీ కలుపుకుని 15 లక్షలు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ. 50 లక్షలు వసూలు చేసింది. మొత్తంగా రూ. 7.67 కోట్లు రాబట్టింది.  ఆంధ్రప్రదేశ్ లో 'సీ' సెంటర్స్ లో సీతమవాకిట్లో..., నాయక్ నూ కూడా క్రాస్ చేసిందని అంటున్నారు.   
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu